యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్‌' జూన్‌ 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. టీజర్‌ విడుదల అయిన సమయంలో సినిమా పై విమర్శలు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న పిల్లల సినిమా అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ తాజాగా సినిమా యొక్క ట్రైలర్ మరియు పాటలు విడుదల అయిన తర్వాత అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా లో ప్రభాస్‌ ను రాముడి పాత్రలో చూడబోతున్నాం. ఈ మధ్య కాలంలో రామాయణం నేపథ్యంలో సినిమాలు రాలేదు. 


కనుక ఈ సినిమా పై అందరి దృష్టి ఉంది. అద్భుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమాను రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. 


ఇండియాలో జూన్ 16వ తారీకున సినిమా విడుదల కాబోతుండగా... ఒక్క రోజు ముందే అంటే జూన్‌ 15వ తారీకున ఉదయం తెల్లవారు జామునే అమెరికాలో ఆట పడబోతుంది. ఆదిపురుష్ ని అత్యధిక స్క్రీన్స్ లో వేసేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 


కేవలం తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా డిమాండ్‌ ను బట్టి ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయిన వెంటనే ప్రభాస్ అభిమానులతో పాటు యూఎస్ లోని ఇండియన్ సినీ ప్రేమికులు ఆన్ లైన్ లో క్యూ కట్టారు. 


Also Read: LSG vs MI IPL 2023 Eliminator: ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌ మ్యాచ్.. ముంబై జట్టులోకి ఇద్దరు ప్లేయర్స్! విధ్వంసకర ఆటగాడికి లక్నో ఛాన్స్  


ఆదిపురుష్ ఒక్కో టికెట్టు ధరను 20 డాలర్లుగా నిర్ణయించారు. ఇండియన్ కరెన్సీ లో రూ.1650 లకు ఒక్క టికెట్‌ చొప్పున ఆన్‌ లైన్ ద్వారా విక్రయాలు మొదలు అయ్యాయి. ఆదిపురుష్ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్‌ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా మొదటి నుండి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. సినిమా మొత్తాన్ని కూడా గ్రీన్ మ్యాట్‌ పై చిత్రీకరించారు. 


ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు ఉపయోగించని అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వినియోగించినట్లుగా చెబుతూ ఉన్నారు. రాముడిగా ప్రభాస్ అలరించబోతుండగా సీత పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కృతి సనన్ ను నటింపజేశారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన విషయం తెల్సిందే. 


రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్‌ ను బద్దలు కొట్టడం ఖాయం అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు. ఇదే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ కూడా జరిగితే ప్రభాస్ తన రికార్డ్‌ ను తానే బద్దలు కొట్టుకునే అవకాశాలు లేకపోలేదు.


Also Read: AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు వర్షాలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook